ఏపీలో కొత్తగా 479 మందికి కరోనా పాజిటివ్..

152
corona
- Advertisement -

ఆంధ్రపదేశ్‌లో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 62,215 కరోనా టెస్టులు నిర్వహించగా 479 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 92 కేసులు రాగా, చిత్తూరు జిల్లాలో 87, గుంటూరు జిల్లాలో 62 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 10 కేసులు, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో 13 చొప్పున కేసులు గుర్తించారు. నెల్లూరు జిల్లాలో 16, ప్రకాశం జిల్లాలో 21, కడప జిల్లాలో 23 కేసులు వెల్లడయ్యాయి.అదే సమయంలో 497 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 8,78,265 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,66,856 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,355 మంది చికిత్స పొందుతున్నారు. అటు, మరణాల సంఖ్య 7,074కి పెరిగిందని తాజాగా ఆరోగ్య శాఖ వెల్లడించింది..

- Advertisement -