ఈరోజు మసాబ్‌ట్యాంక్ లోని మహావీర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ సెంటర్‌లో పలు ఆధునిక వసతులను ప్రారంభించారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. ఇందులో భాగంగా మహావీర్ అసుపత్రిలో సిటీ స్కాన్, మెడికల్ షాప్, రిసెప్షన్ సెంటర్‌లను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ.. ఇవాళ సంపద నీది, నిన్న వేరొకరిది, రేపు మరొకరిది, ఎవరికీ శాశ్వతం కాదు. మానవ సేవయే మాధవ సేవ..అన్నారు. ఎంత సంపద సృష్టించాము అన్నది ముఖ్యం కాదు.. ఆ సంపద ఎంత మంది కన్నీళ్లు బాధలను తీర్చింది అనేది ముఖ్యమని మంత్రి తెలిపారు.
వైద్యం కోసం చేసే సాయం పుణ్యం ఇస్తుంది. మహావీర్ హాస్పిటల్‌లో అతి తక్కువ ధరకు అందిస్తున్న వైద్య సేవలు ఇంకా విస్తరించాలని కోరుకుంటున్నాము. మీ సేవలు చూసే ముఖ్యమంత్రి కేసీఆర్ హాస్పిటల్ స్థలాన్ని మరో 30 సంవంత్సరాలు లీజు కింద కేటాయించారు. మరింత సేవ చేయండి, ప్రభుత్వం తరపున మద్దతు ఉంటుందని మంత్రి ఈటెల పేర్కొన్నారు.