మొదలైన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు…

159
drunk and drive
- Advertisement -

కరోనా లాక్ డౌన్‌తో బ్రేక్ పడిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మళ్లీ మొదలయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు పోలీసులు.

బ్రీత్‌ ఎనలైజర్‌కు శానిటేషన్‌ చేసి, ఫేసు షీల్డ్‌ ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు చేస్తున్నారు. తనిఖీల సందర్భంగా ఎవరికి కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. దీంతో తాగి నడిపితే వాహనం స్వాధీనంతో పాటు చలాన్‌, కోర్టుకు హాజరు కావాల్సిందేనని చెబుతున్నారు పోలీసులు.

ఇటీవల రాత్రి వేళల్లో ద్విచక్ర, భారీ వాహనాలతో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోవడం, కొవిడ్‌ కారణంగా తనిఖీలు లేకపోవడంతో మందుబాబులు తాగి విచ్చలవిడిగా వాహనాలు నడుపుతున్నారు. దీంతో సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -