రైతు,కార్మిక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె..

257
strike
- Advertisement -

కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మెబాట పట్టాయి. 25 కోట్లకు పైగా కార్మికులు సమ్మెలో పాల్గొన్నట్లు కార్మిక సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు రాస్తారోకో చేపట్టారు. మోడీ సర్కార్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమ్మెలో అఖిల భారత బ్యాంకు ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌, అఖిల భారత బ్యాంకు ఆఫీసర్స్‌ అసోసియేషన్‌, బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా పాల్గొన్నాయి. కార్మిక సంఘాల సమ్మెకు టీఆర్ఎస్‌ కూడా మద్దతు ప్రకటించింది.

రైతు వ్యతిరేక చట్టాలు, కార్మిక వ్యతిరేక కోడ్‌లను ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని కార్మిక సంఘాల నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.అందరికీ పెన్షన్‌, ఎన్‌పీఎస్‌ రద్దు, పాత పెన్షన్‌ పథకం పునరుద్ధరణ చేపట్టాలన్నారు. నిరుపేదలకు నెలకు ఒక్కొక్కరికి 10 కిలోల ఉచిత రేషన్‌ ఇవ్వాలన్నారు.

- Advertisement -