దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె…

252
bharath bandh
- Advertisement -

దేశ వ్యాప్తంగా వ్యవస్థీకృత, అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న కార్మికులు తమ హక్కుల సాధన కోసం కార్మిక సంఘాలు రెండు రోజులపాటు సమ్మె చేపట్టాయి. కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది.

పది కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సంఘటిత, అసంఘటిత కార్మికులు నేడు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. పలు చోట్ల జనజీవనం స్తంభించింది. కోల్‌కతాలో సమ్మెకు దిగిన సీపీఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళలోనూ పలు చోట్ల కార్మికులు సమ్మె చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ పలు కార్మిక సంఘాలు రోడ్లపై ఆందోళన చేపట్టాయి.

citu

కార్మికుల సమ్మెకు మద్దతుగా జనవరి 8,9 తేదీల్లో తాము సమ్మె చేపట్టనున్నట్లు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలకు అంతరాయం కలగనుంది. అయితే తెలంగాణలో సమ్మె ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. హైదరాబాద్ లో ఆటోలు, ఆర్టీసీ బస్సులు యాధావిధిగా తిరుగుతున్నాయి.

- Advertisement -