మోనాల్‌తో డేటింగ్ వద్దు..అభి కంటతడి!

41
abhijith

బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 4 ఎపిసోడ్ 81లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బిగ్ హౌస్‌లో మిస్టర్‌ కూల్‌గా పేరు తెచ్చుకున్న అభిజిత్ తొలిసారి కంటతడి పెట్టుకున్నాడు. మోనాల్‌ని ఏడిపించిన కారణంగా అఖిల్-అభిజిత్‌లలో ఒకరు ఆమెతో డేటింగ్‌కి వెళ్లాలని చెప్పగా అప్‌సెట్ అయ్యాడు.

మోనాల్‌తో నాకు ఎటువంటి లింక్ పెట్టకండి అని నేను చెప్తూ ఉన్నా.. మళ్లీ డేట్ ఏంటి? నేను తనని ఏడిపించడం ఏంటి? నాకు అసలు ఈ టాస్క్ వద్దు..ఈ టాస్క్‌కి నేను ఒప్పుకుంటే నేను ఆమెను ఏడిపించానని ఒప్పుకున్నట్టు. అసలు మోనాల్ టాపిక్ నా దగ్గర ఉండకూడదు అనుకుంటున్నా అంటూ ఎమోషన్ అయ్యాడు.

మేం ఇద్దరం కలిసి మోనాల్‌ని ఏడిపించడం ఏంటి? ఇది బిగ్ డీల్‌లా అనిపిస్తుంది. నాకు ఎక్కడో కొడుతుంది. నాకు ఈ మోనాల్ అభిజిత్ ప్రజెక్షన్ వద్దు.. అంటూ తెలిపాడు. మోనాల్ టాపిక్ వచ్చిన ప్రతిసారి నాకు రాడ్ పడుతుంది.నా జర్నీ మొత్తంలో ఈ మోనాల్‌ టాపికే బిస్కెట్‌ అవుతుంది. నేను మోనాల్‌తో డేట్‌కి పోను బిగ్ బాస్.. నాకు ఈ టాస్క్ వద్దు అంటూ బిగ్ బాస్‌ని కోరాడు.

ఇది ఇంటి సభ్యులకు ఇచ్చిన లగ్జరీ బడ్జెట్ టాస్క్.. దీనిలో భాగంగా టాస్క్‌లు చేయడం మీ బాధ్యత అని.. అభిజిత్ నిరాకరించిన కారణంగా అఖిల్ టాస్క్ కంప్లీట్ చేయాలని చెప్పారు. దీంతో అభిజిత్ కంటతడి పెట్టగా హారిక ఓదార్చే ప్రయత్నం చేసింది.