మారడోనా మృతి పట్ల గంగూలీ విచారం..

79
ganguly

ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు,అర్జెంటినా ప్లేయర్ డీగో మారడోన గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన అభిమాన నటుడు మృతిపట్ల నివాళి అర్పించారు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ.

ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందించిన గంగూలీ … నా హీరో ఇక లేరు.. నాకు పిచ్చిగా న‌చ్చిన ఆట‌గాడికి వీడ్కోలు ప‌లుకుతున్నా.. నీ కోస‌మే నేను ఫుట్‌బాల్ చూసేవాడిన‌ని సౌరవ్ భావోద్వేగంతో స్పందించారు.మార‌డోనాతో క‌లిసి దిగిన ఓ ఫోటోను త‌న ట్వీట్‌లో షేర్ చేశారు.

ఫుట్‌బాల్‌తో పాటు యావ‌త్ క్రీడాలోకం ఓ మేటి ఆట‌గాడిని కోల్పోయింద‌ని….. రెస్ట్ ఇన్ పీస్ మార‌డోనా. మేం నిన్ను మిస్ అవుతున్నామ‌ని స‌చిన్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.