దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

185
dubbaka
- Advertisement -

దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. సిద్దిపేట అర్బన్‌ మండలంలోని పొన్నాల ఇందూరు ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా మధ్యాహ్నం 12 గంటలలోగా తుది ఫలితం వెలువడనుంది.

ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌, కాం గ్రెస్‌, బీజేపీ సహా 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈనెల 3న జరిగిన పోలింగ్‌లో 1,64,186 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82.61 పోలింగ్‌ శాతం నమోదైంది.

ఒక్కో రౌండుకు 14 టేబుళ్లను ఏర్పాటుచేశారు. మొత్తం 23 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపును తాసిల్దార్‌, ఎంపీడీవో స్థాయి అధికారి పర్యవేక్షించనున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలుల్లో ఉంది.

- Advertisement -