బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 61 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 61వ ఎపిసోడ్‌లో లాస్య తన ఫ్యామిలీ గురించి చెబుతూ ఎమోషన్ అవడం, కెప్టెన్సీ పోటీదారుల్లో హారిక,అరియానా నిలవడం,పల్లెకు పోదాం ఛలో ఛలో టాస్క్ ముగిసింది.
61 ఎపిసోడ్‌లో అరియానా-అభిజిత్‌ల మధ్య వార్ నడిచింది. ప్రతి టాస్క్‌ని ఫుడ్ దగ్గర స్టాప్ చేసేస్తావ్.. నీ ఆట నాకు నచ్చదు అని అరియానా చెప్పడంతో అభిజిత్ సీరియస్ అయ్యాడు. మరోవైపు పాన్ షాపు యజమానిగా ఉన్న అవినాష్ దగ్గర పాన్‌ని అఖిల్ చెప్పకుండా తినేయడంతో గ్రామ పెద్దతో గొడవకు దిగారు అవినాష్,మెహబూబ్.
అరియానా తనకు పప్పుతో పాటు ఆమ్లెట్ కూడా కావాలని అనడంతో మళ్లీ గొడవ పెద్దదైంది. అమ్మా రాజశేఖర్ తిరిగి ధాన్యం ఇచ్చి రైస్‌తో పాటు ఆమ్లెట్ అడగ్గా.. రైస్ ఇస్తాం కాని ఆమ్లెట్ ఇవ్వమని అభిజిత్ చెప్పడంతో కోపంతో మోనాల్ చేతిలో ఫుడ్‌ని లాగేశాడు మాస్టర్. దీంతో మాస్టర్ – అభిజిత్ మధ్య మళ్లీ పెద్ద గొడవ జరిగింది.
ఇక సీక్రెట్ టాస్క్‌లో భాగంగా అవినాష్‌కి కోపం తెప్పించాలని బిగ్ బాస్ హారికకు తెలపగా అనుకున్నట్లుగానే రచ్చ రచ్చ చేసింది. హారిక తన గేమ్ ప్లాన్‌ని వర్కౌట్ చేస్తూ పాన్ షాప్‌ని ద్వంసం చేస్తుండగా మధ్యలో అఖిల్ వెళ్లి షాప్‌ని ధ్వంసంచేయడంతో గొడవ పెద్దదైంది. మధ్యలో ఊరి పెద్ద మనిషి వెళ్లి చెప్పినా ఎవరూ వినలేదు. ఒకర్నొకరు తోసుకుంటూ గొడవకు దిగారు.
ఇక హారికకు ఇచ్చిన సీక్రెట్స్ టాస్క్‌లలో భాగంగా మాస్టర్‌పై కాఫీ పోయడం,అవినాష్‌కు కోపం తెప్పించడంలో సక్సెస్ అయినా ఇంటి సభ్యుల్లో ఒకర్ని హత్య చేస్తున్నట్టుగా లిప్ స్టిక్‌తో మిర్రప్ పై రాయాలనే టాస్క్ దగ్గర దొరికిపోయింది. ఇంటి సభ్యులంతా హారికనే హత్యలు చేస్తుంది అని నిర్దారణకు వచ్చినా నేను కాదు అని టాస్క్ పూర్తియ్యే వరకూ నమ్మించగలిగింది.
తర్వాత పల్లెకు పోదాం టాస్క్ ముగిసినట్లు బిగ్ బాస్ ప్రకటించడంతో ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా ముగ్గురు ఎంపికయ్యారు. మాస్టర్‌తో పాటు హారిక, అరియానాలను కెప్టెన్ పోటీదారులుగా ఎంపికైనట్లు ప్రకటించారు. దీంతో హారిక ఆస్కార్ రేంజ్ పర్ఫామెన్స్ ఇచ్చింది.