- Advertisement -
దుబ్బాక ఉప ఎన్నిక- రంగంలోకి కేంద్ర ఎన్నికల సంఘం దుబ్బాక ఉప ఎన్నికల్లో నోట్ల కట్టల కలకలంతో కేంద్ర ఎన్నికల సంఘం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కాంగ్రెస్, బీజేపీ నేతల ఫిర్యాదులతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకుడిని దుబ్బాకకు పంపనుంది.
తమిళనాడు క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి సరోజ్ కుమార్ ను దుబ్బాకకు స్పెషల్ ఆఫీసర్ గా పంపనున్నట్లు ప్రకటించింది. సిద్ధిపేట ఘటన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకుడిని పంపాలని, కేంద్ర బలగాల రక్షణలో ఎన్నికలు నిర్వహించాలని కోరింది.
ఇటు కాంగ్రెస్ కూడా ఇదే డిమాండ్ చేస్తూ ఈసీకి లేఖ రాసింది. సరోజ్ కుమార్ కు పారదర్శకంగా ఎన్నికలు జరిపినందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం అవార్డు కూడా లభించింది.
- Advertisement -