ఏపీలో పెను విషాదం..ఈతకెళ్లి 6గురు మృతి

51
swim

ఏపీలో పెను విషాదం చోటుచేసుకుంది. ఈతకెళ్లి ఆరుగురు బాలురు మృతి చెందగా అంతా 16 ఏళ్లలోపు వారే కావడం స్ధానికంగా విషాదాన్ని నింపింది.పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. వేలేరుపాడు మండలం బూదేవిపేట గ్రామానికి చెందిన పలువురు వన భోజనాలు చేసేందుకు పెదవాగుకు వెళ్లారు. ఈ క్రమంలో సరదాగా వసంతవాడ వాగులో ఈత కోసం దిగారు. ఇంతలోనే ఆరుగురు బాలురు గల్లంతయ్యారు. ఈ సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

ఆ క్రమంలో బుధవారం మధ్యాహ్నం గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు భూదేవి పేటకు చెందినవారుగా గుర్తించారు. ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతులంతా 15- 16 సంవత్సరాల మధ్య వయసున్న వారుగా తేలింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మృతుల వివరాలు
1) గంగాధర వెంకట్రావు (16)
2) శ్రీరాముల శివాజీ (16)
3) గొట్టుపర్తి మనోజ్ (16)
4) కర్నటి రంజిత్ (15)
5) కెల్లాసాయి (16)
6) కూనవరపు రాధాకృష్ణ.