ఐపీఎల్ 2020లో భాగంగా ఆదివారం జరిగిన కీలక పోరులో ఆర్సీబీపై చెన్నై….ముంబై పై రాజస్ధాన్ విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 146 పరుగుల లక్ష్యాన్ని చెన్నై18.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(65 నాటౌట్: 51 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధసెంచరీతో మెరవడంతో చెన్నై అలవోకగా విజయం సాధించింది.
అంతకుముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ(50: 43 బంతుల్లో 1ఫోర్, 1సిక్స్) అర్ధశతకానికి తోడు డివిలియర్స్(39: 36 బంతుల్లో 4ఫోర్లు) రాణించడంతో బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది.
మరో మ్యాచ్‌లో ముంబై పై రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెన్‌స్టోక్స్(107: 60 బంతుల్లో 14ఫోర్లు, 3సిక్సర్లు), సంజూ శాంసన్(54 నాటౌట్: 31 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధశతకంతో రాణించడంతో 196 పరుగుల లక్ష్యాన్ని18.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
అంతకుముందు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య(60 నాటౌట్ :21 బంతుల్లో 2ఫోర్లు, 7సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగులు చేసింది.