మళ్లీ మోనాల్‌ గురించి అఖిల్ ఎమోషన్‌!

39
akhil

బిగ్ బాస్ 4 తెలుగు విజయవంతంగా 50 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 50వ ఎపిసోడ్‌లో భాగంగా నాగార్జున ప్లేస్‌లో సమంత హోస్ట్‌గా ఎంట్రీ ఇవ్వగా ఒక్కొక్కరి గురించి చెబుతూ పంచ్‌లు వేసింది.

ఇక అఖిల్ బలం, బలహీనతలు గురించి చెబుతు పంచ్‌లు వేసింది సమంత. అఖిల్ డ్రెస్ బావుంది.. గుజరాతీనా అని పరోక్షంగా మోనాల్ ప్రస్తావన తెస్తూ పంచ్ వేశారు. తనకు ఓపిక చాలా ఎక్కువని….అలాగే అదే తన బలహీనత.. ఎవరైనా అబద్ధం ఆడితే అస్సలు నచ్చదని తెలిపాడు.

ఇక మోనాల్ గురించి మాట్లాడుతూ.. ఈవారం నుంచి నేను చాలా బాధపడుతున్నా.. ఎందుకంటే మోనాల్‌ని నామినేట్ చేశా అని తెలిపాడు అఖిల్. గుండె భారంగా ఉందని…నామినేషన్స్ వచ్చినప్పుడు మోనాల్‌కి నాకు పడింది. మేం ఇద్దరం క్లారిటీగానే ఉన్నాం అన్నారు.

తాను సింపథీ కోసం రాలేదు.. నాలాగా నేను ఉండటానికి వచ్చా.. ఇక్కడ కూడా నాలాగా నేను లేకపోతే వేస్ట్ అన్నాడు. చివరగా మోనాల్ ఎలిమినేట్ అయింది అంటూ తెగ బాధపడిపోయాడు అఖిల్.