ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఘన విజయం సాధించింది. రెండు జట్లు సేమ్ స్కోరు చేయగా సూపర్ ఓవర్ ఆడాల్సిన పరిస్ధితి ఏర్పడింది. అయితే సూపర్ ఓవర్ కూడా టై కావడంతో రెండో సూపర్ ఓవర్ లో పంజాబ్ విజయం సాధించింది. ముంబై 11 పరుగులు చేయగా పంజాబ్ 4 బంతుల్లోనే 15 పరుగులు చేసి విజయం సాధించింది.
ముంబై విధించిన 177 పరుగుల లక్ష్యచేదనలో 6 వికెట్లు కొల్పోయి 176 పరుగులు చేసింది పంజాబ్. మయాంక్ అగర్వాల్ 11,క్రిస్ గేల్ 24,నికోలస్ పురాన్ 24,మ్యాక్స్‌వెల్ 0 పెవిలియన్ బాటపట్టారు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్న మరోవైపు ఒంటరి పోరాటం కొనసాగించాడు రాహుల్. 51 బంతుల్లో 3 సిక్స్‌లు,7 ఫోర్లతో 77 పరుగులు చేసి పంజాబ్ విజయంలో కీ రోల్ పోషించాడు. చివర్లో దీపక్ హుడా 25 ,జోర్డాన్ 8 రాణించారు.
అంతకముందు టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (53: 43 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించగా చివర్లో పొలార్డ్(34 నాటౌట్: 12 బంతుల్లో 1ఫోర్,4సిక్సర్లు), కృనాల్ పాండ్య(34: 30 బంతుల్లో 4ఫోర్లు్, సిక్స్), నాథన్(24 నాటౌట్: 12 బంతుల్లో 4ఫోర్లు) మెరుపులు మెరిపించారు. రోహిత్ శర్మ(9), సూర్యకుమార్ యాదవ్(0), ఇషాన్ కిషన్(7) విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ(2/30), అర్షదీప్ సింగ్(2/35) చెరో రెండు వికెట్లు పడగొట్టారు.