బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 43 హైలైట్స్

185
spiesode 43
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 43 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఆదివారం ఎలిమినేషన్ టైం కావడంతో హౌస్‌ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూడగా ఎవరూ ఉహించని విధంగా కుమార్ సాయి హౌస్‌ నుండి ఎలిమినేట్ అయ్యారు.

సండే ఫన్‌ డేలో భాగంగా అభిని ఓడించింది దివి. ఇంటిస‌భ్యుల‌ను రెండు టీమ్‌లుగా విడ‌గొట్టి అఖిల్‌, సోహైల్‌, కుమార్ సాయి, అమ్మ రాజ‌శేఖ‌ర్‌, దివి, హారిక ఏ టీమ్‌గా ఏర్ప‌డ‌గా మిగ‌తా వారంద‌రూ బీ టీమ్‌లో ఉన్నారు. నోయ‌ల్ సంచాకుడిగా వ్య‌వ‌హ‌రించాడు. బెలూన్లు ప‌గ‌ల‌గొట్టే డాట్స్ గేమ్‌లో దివి గెల‌వ‌గా అభిజిత్ ఓడిపోయాడు.

చేతుల‌తో త‌ల‌ప‌డే ఆట‌లో హారిక మోనాల్‌ను ఓడించి త‌న స‌త్తా చూపించింది. పిగ్గీ బ్యాగ్ రేసింగ్‌లో సోహైల్ హారిక‌ను ఎక్కించుకోగా, మెహ‌బూబ్ అరియానాను ఎత్తుకుని ప‌రిగెత్తాడు. ఈ ఆట‌లో మెహ‌బూబ్ రేసుగుర్రంలా ప‌రుగెత్తి విజేత‌గా నిలిచాడు. బంతిని ఎక్కువ‌సార్లు చేతితో కొట్టే ఆట‌లో అవినాష్ ఓడిపోగా కుమార్ విజ‌యం సాధించాడు. బాస్కెట్ బాల్‌లో అఖిల్ క‌న్నా ఎక్కువ బంతులు వేసి లాస్య గెలిచింది. త‌ర్వాత రెండు టీమ్‌లు ట‌గ్ ఆఫ్ వార్ ఆడ‌గా.. బీ టీమ్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన ఏ టీమ్ విన్న‌ర్‌గా నిలిచింది. అనంత‌రం నోయ‌ల్ ర్యాప్ సాంగ్ ద్వారా అఖిల్, దివి సేఫ్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు.

చివరగా ఎలిమినేషన్‌లో మోనాల్-కుమార్ సాయి ఉండగా వీరిద్దరిని బ్యాగ్ సర్దేసుకుని కన్ఫెషన్‌ రూమ్‌లోకి రమ్మన్న నాగ్…కాసేపు సస్పెన్స్ అనంతరం కుమార్ సాయి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. నవ్వుతూ బయటకు వచ్చిన కుమార్ సాయి…చెప్పే కథను వింటనాని నాగ్ చెప్పడంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక చివరగా ఒక్కొక్కరి గురించి చెబుతూ వచ్చిన కుమార్ పొతుపొతూ అమ్మ రాజశేఖర్ మాస్టర్‌పై బిగ్ బాంబ్ విసిరాడు. దీంతో ఎపిసోడ్ ముగిసింది.

- Advertisement -