టాస్‌ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్..

170
shr
- Advertisement -

ఆదివారం ఐపీఎల్‌లో భాగంగా రెండు మ్యాచ్ లు జరగనుండగా, తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లాడి మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది

ఖలీల్‌ అహ్మద్‌ స్థానంలో బసిల్‌ థంపీ, షాబాజ్‌ నదీం స్థానంలో అబ్దుల్‌ సమద్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు వార్నర్‌ తెలిపాడు. కోల్‌కతా జట్టులోనూ రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రసిధ్‌ కృష్ణ, క్రిస్‌ గ్రీన్‌ స్థానంలో కుల్దీప్‌ యాదవ్‌, లాకీ ఫెర్గుసన్‌లను తీసుకున్నట్లు కోల్‌కతా సారథి ఇయాన్‌ మోర్గాన్‌ వెల్లడించాడు.

సన్ రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, ప్రియం గార్గ్, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, టీ నటరాజన్, బాసిల్ థంపి.

కోల్ కతా నైట్ రైడర్స్: రాహుల్ త్రిపాఠి, శుభమాన్ గిల్, నితీష్ రానా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), ఆండ్రే రస్సెల్, ప్యాట్ కమ్మిన్స్, శివం మావి, కుల్దీప్ యాదవ్, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి.

- Advertisement -