ప్రతి నెల పల్లె ప్రగతి కార్యక్రమం కొరకు 308 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నది. ఈ నిధుల్లో 85శాతం గ్రామ పంచాయతీ లకు,10% మండల ప్రజా పరిషత్ లకు,5% జిల్లా ప్రజా పరిషత్ లకు ప్రభుత్వం విడుదల చేస్తుంది.
పల్లె ప్రగతి కార్యక్రమం కింద 2019 సెప్టెంబర్ నెల నుండి మార్చి 2020 వరకు రూ. 4528.50 కోట్లు విడుదల కాగా, ఏప్రిల్ 2020 నుండి ఇప్పటి (అక్టోబర్)వరకు రూ.2155.50 కోట్లు పల్లె ప్రగతి కార్యక్రమం కింద విడుదల అయ్యాయి.
కాగా ప్రస్తుతం విడుదలైన నిధుల్లో జిపి లకు రూ. 277.22 కోట్లు, మండల పరిషత్ లకు రూ.20.52 కోట్లు, జిల్లా పరిషత్ లకు రూ.10.26 కోట్ల కేటాయింపు జరిగింది.ఈ నిధులను కరోనా కష్ట కాలంలో కూడా సీఎం కేసిఆర్ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ లపై గౌరవంతో విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ లు, మండల, జిల్లా ప్రజా పరిషత్ ల బలోపేతం కొరకు ప్రతి నెలా, ముఖ్యంగా కరోనా కష్ట కాలంలో కూడా నిధులను మంజూరు చేయిస్తున్న సీఎం కేసిఆర్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.