రాజస్ధాన్‌పై ఢిల్లీ విక్టరీ…పాయింట్ల పట్టికలో అగ్రస్ధానం

129
dc vs rr

ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా వేదికగా రాజస్ధాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 46 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నమెంట్‌లో 5వ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో నిలిచింది.185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్ధాన్ 19.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ బట్లర్ 13,జైస్వాల్ 34,స్మిత్ 24,శాంసన్ 5,లోరర్‌ 5 పరుగులు చేసి పెవిలియన్ బాటపట్టారు. దీంతో 82 పరుగులకే 5 వికెట్లు కొల్నోయి రాజస్ధాన్ కష్టాల్లో పడింది.

తర్వాత కూడా వెంటవెంటనే ఆర్చర్ 2,టై 6,శ్రేయాస్ గోపాల్ 2 పరుగులు చేసి ఔట్ అవుతున్న మరో ఎండ్‌లో తెవాటియా ఒంటరి పోరాటం చేశాడు. 38 పరుగులతో రాణించిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఢిల్లీ బౌలర్లలో రబాడ 3,స్టాయినిస్,అశ్విన్ 2 వికెట్లు తీయగా నోర్టజే,అక్షర్ పటేల్,హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.

అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 184 పరుగుల భారీ స్కోరు సాధించింది. జోఫ్రా ఆర్చర్‌ ధాటికి టాప్ ఆర్డర్ కుప్పకూలింది. శిఖర్‌ ధావన్‌(5), పృథ్వీ షా(19) విఫలమయ్యారు. కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌(22) , పంత్‌(9) తక్కువ పరుగులకే వెనుదిరగడంతో ఢిల్లీ కష్టాల్లో పడింది. అయితే ఈ క్రమంలో మార్కస్‌ స్టాయినీస్‌ (39: 30 బంతుల్లో 4సిక్సర్లు), హెట్‌మైర్‌(45: 24 బంతుల్లో ఫోర్‌, 5సిక్సర్లు) రాణించడంతో 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది.