దేశం తెలంగాణ వైపు చూస్తుంది- శ్రీనివాస్ గౌడ్

332
Minister Srinivas Goud
- Advertisement -

పాడిపంటలతో తులతూగిన కొల్లాపూర్ 70 ఏళ్ల సమైక్య పాలనలో కోన్ పూచ్ తా కొల్లాపూర్‌గా మారింది అన్నారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌. ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో నూతన రెవిన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో కలిసి భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్ ,జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఆరేండ్ల పాలనతో కేసీఆర్ పూర్వ వైభవం తీసుకువచ్చారు.ఇప్పుడు దేశం తెలంగాణ వైపు చూస్తుంది. ఒకటి కాదు వంద పథకాలు కేసీఆర్ గారు తీసుకువచ్చారని మంత్రి అన్నారు.

పేద పిల్లలకు సన్నబియ్యం అన్నం, గురుకుల పాఠశాలలు ప్రారంభించి కేసీఆర్ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచారు. దేశంలో జై జవాన్, జై కిసాన్ పదాలు నినాదాలుగానే మిగిలిపోయాయి. రైతుబిడ్డ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. రైతుబిడ్డను వ్యవసాయ శాఖ మంత్రిని చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆరేళ్లలో అన్నపూర్ణను చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా 24 గంటల కరంటు వ్యవసాయానికి ఉచిత కరంటు ఇస్తున్నారని మంత్రి కొనియాడారు.

పేదింటి ఆడబిడ్డల పెళ్లికి కళ్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్ష 116 అందజేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ నూతన రెవిన్యూచట్టాన్ని రైతాంగం మనస్ఫూర్థిగా స్వాగతిస్తుంది. పట్టణాలకు ధీటుగా కేసీఆర్ పల్లెలను తీర్చిదిద్దుతున్నారు. ప్రశాంతంగా ఉండాల్సిన పల్లెలలో భూ సమస్యలు కొట్లాటలు పెడుతున్నాయని కేసీఆర్ కొత్త రెవిన్యూచట్టం తీసుకువచ్చారు. కొత్త చట్టంతో గ్రామంలో ఇక భూ సమస్యలుండవు .. రికార్డులను ఎవరూ తారుమారు చేయలేరని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ పేర్కొన్నారు.

- Advertisement -