Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Tuesday, June 30, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home సినిమా కాజల్‌కు కాబోయే భర్త ఇతడేనట..?
  • సినిమా

కాజల్‌కు కాబోయే భర్త ఇతడేనట..?

October 5, 2020 7:41 PM
386
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    Kajal Agarwal
    - Advertisement -

    హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కాజల్‌ కథానాయికగా 50కి పైగా సినిమాలు చేసింది. వ‌య‌సు 30 దాటినా కూడా ఇప్ప‌టికీ వ‌ర‌స సినిమాల‌తో స్టార్ హీరోయిన్ హోదా అనుభ‌విస్తుంది కాజ‌ల్. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న జీవితంలో పెళ్లి అనే టాపిక్ రాలేద‌ని చెప్పింది ఈ ముద్దుగుమ్మ‌. కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చినట్లే కనిపిస్తుంది. కాజల్ పెళ్లి చేసుకోబోతుంది అంటు గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

    తాజాగా కాజల్ నిశ్చితార్థం, పెళ్లి కి సంబంధించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. కాజల్ త్వరలో బిజినెస్‌‌మెన్‌ని వివాహం చేసుకోనుందట. ఇటీవలే ముంబైకి చెందిన బిజినెస్‌‌మెన్‌ గౌతమ్‌ కిచ్లుతో కాజల్‌ నిశ్చితార్థం జరిగిందని తెలుస్తోంది. ఆ మ‌ధ్య ప్రేమ పెళ్లి మాత్ర‌మే చేసుకుంటాన‌ని.. పైగా ఇండ‌స్ట్రీలో ఉన్న వాళ్ల‌ను మాత్రం చేసుకోన‌ని తెగేసి చెప్పింది ఈ మిత్రవింద. ఇప్పుడు అదే నిజం కానుంది. అయితే గౌతమ్, కాజల్ స్కూల్ ఏజ్ నుంచే ప్రేమించుకుంటున్నారనేది ఇప్పుడు వస్తున్న వార్త. ఇద్దరూ కలిసి కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్‌లోనే చదువుకున్నారు. ఆ తర్వాత టఫ్ట్స్ యూనివర్సిటీలో.. ఆ తర్వాత ఇన్ సీడ్‌లో చదువుకున్నారని తెలుస్తుంది. అప్పట్నుంచే ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

    మరోవైపు గౌతమ్ కిచ్లు డిసెర్న్ లివింగ్ అనే ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడియోకి ఫౌండర్ అని తెలుస్తుంది.అయితే ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తైన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్తుంది ఈ ముద్దుగుమ్మ. ఏదేమైనా కూడా కాజల్ అగర్వాల్ పెళ్లి ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం కాజల్‌ చిరంజీవితో ‘ఆచార్య’, కమల్‌ హాసన్‌తో ‘ఇండియన్ 2’, మంచు విష్ణు సోదరిగా ‘మోసగాళ్లు’ సినిమాల్లో నటిస్తుంది.

    - Advertisement -
    • TAGS
    • Kajal Agarwal
    • Kajal Aggarwal Engagement
    • Tollywood
    • కాజల్‌ అగర్వాల్
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleదేశం తెలంగాణ వైపు చూస్తుంది- శ్రీనివాస్ గౌడ్
      Next articleమంత్రి ఎర్రబెల్లిని కలిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు..
      Mallesh

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy