హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫిట్ ఇండియా – ఫిట్ తెలంగాణ ప్రీడమ్ రన్ లో పాల్గొన్నారు రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి అధేశాల మేరకు తెలంగాణ ప్రజల ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమము లో భాగంగా క్రీడా శాఖ అధ్యర్యంలో ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా “ఫిట్ ఇండియా – ఫిట్ తెలంగాణ “ ప్రీడమ్ రన్ ను లాల్ బహదూర్ స్టేడియం లో ఈ రోజు నిర్వహిస్తున్నామన్నారు.
ప్రజలు, క్రీడకారులు రోజు వారి జీవితంలో శారీరక శ్రమలు మరియు క్రీడలు భాగస్వామ్యం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు. ప్రజలు, క్రీడాకారులు ఫిట్ గా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా ఆగష్టు 15 నుండి నేటి వరకు ఉద్యమంగా నిర్వహిస్తున్నారన్నారు. క్రీడా శాఖ అధ్వర్యంలో ఫిట్ తెలంగాణ ప్రీడమ్ రన్ ను ఎల్ బి స్టేడియం తో పాటు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఘనంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
ప్రస్తుతం పరిస్థితులలో ప్రతి ఒక్కరూ శారీరకంగా , ఆరోగ్యంగా ఉండటానకి తప్పనిసరిగా వాకింగ్, వీలైతే కోద్దిదూరం పరుగేత్తడం వల్లన రోగ నిరోదక శక్తిని పెంచుకోవటానికి ఈ ఫిట్ తెలంగాణ ఫ్రీడమ్ రన్ ను ప్రజల అవగాహన కోసం నిర్వహిస్తున్నామన్నారు మంత్రి.
ఈ ఫిట్ తెలంగాణ ఫ్రీడమ్ రన్ లో పాల్గోనే వారందరు ప్రస్తుత కోవిడ్ నిబందనల వల్ల సామాజిక దూరం ను పాటిస్తూ ఈ రన్ లో పాల్గోనాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారి అదేశాల మేరకు ప్రతి అసేంబ్లీ నియేజక వర్గం (119) లో స్టేడియం ల నిర్మాణం చేస్తున్నాము. ఇప్పటికే 50 పైగా స్టేడియాలను నిర్మించి ప్రారంబించటం జరిగిందన్నారు.మిగతా స్టేడియాలు వివిధ దశలలో నిర్మాణం లో ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహనికి ప్రభుత్వం పేద్దపీఠ వేసిందన్నారు.క్రీడాకారులను ప్రోత్సహించటానికి ఉద్యోగాలలో 2 శాతం, ఉన్నత విద్య కోసం 0.5 శాతం రిజర్వేషన్లు ను అమలు చేస్తున్నామన్నారు.రాష్ట్రంలో క్రీడల అభివృద్ది కి ముఖ్యమంత్రి కెసిఆర్ గ క్రీడా పాలసీ ని ప్రకటించారు. క్రీడా పాలసి రూపోందించటానికి క్యాబినేట్ సబ్ కమీటి ని నియమించారు.ఈ క్యాబినేట్ సబ్ కమీటి ద్వారా వివిధ దేశాలలో ఉన్న క్రీడా పాలసీలను అధ్యాయనం చేసి దేశంలో ఉన్న అత్యుత్తమ క్రీడా పాలసీని రూపోందించబోతున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రం క్రీడా హబ్ గా తీర్చిదిద్దబోతున్నామన్నారు మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ గారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపి చంద్, చాముందేశ్వరినాథ్, ప్రణవి, క్రీడా శాఖ కార్యదర్శి ks శ్రీనివాస రాజు, చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రో. లక్ష్మీ కాంత్ రాథోడ్ లు మరియు వందలాది క్రీడాకారులు పాల్గొని ఫిట్ ఇండియా – ఫిట్ తెలంగాణ ప్రీడమ్ రన్ ను విజయవంతం చేశారు.