కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా వారివారి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్ అప్ డేట్ చేయాల్సి వుంటుంది. వాహనదారుల వాహనానికి ఆర్సీ బుక్ ఉన్నప్పటికీ, అలాగే వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్స్‌లో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ అప్‌డేట్ చేసుకోవల్సిందే. అసలు ఈ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్‌లకు మళ్లీ కొత్తగా అప్ డేట్ చేయడం ఏంటి అనుకోవచ్చు.
అది ఏంటంటే..అక్టోబర్ 1 నుంచి దేశ వ్యాప్తంగా యూనిఫాం వెహికిల్స్ రిజిస్ట్రేషన్ కార్డ్స్(ఆర్‌సీలు), డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయబడతాయి. కొత్తగా జారీ చేయబడి డ్రైవింగ్ లైసెన్సులు మైక్రోచిప్ కలిగి ఉంటాయి. క్యూఆర్ కోడ్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్‌సీ) ఫీచర్లు కూడా ఉంటాయి. ఈ విధంగా సెంట్రలైజ్ చేసిన డేటా పదేళ్ల వరకు గవర్నమెంట్ వద్ద ఉంటుంది. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వ్యక్తులకు ఫైన్లు వేయడం, రికార్డులను నిర్వహించడం ప్రభుత్వానికి ఈజీ అవుతుంది. ఇక ఆర్సీల విషయానికొస్తే.. అక్టోబర్ 1 నుంచి ఈ ప్రక్రియను పేపర్ ఉపయోగించకుండా చేయాలని నిర్ణయించుకుంది. కొత్త ఆర్సీకి ఓనర్ పేరు ముందు భాగంలో ఉంటుంది. వెనుకభాగంలో మైక్రోచిప్, క్యూఆర్ కోడ్ ఉంటాయి.