గ్రేటర్ ఎన్నికలపై తన వ్యాఖ్యలు వక్రీకరించారు: కేటీఆర్

148
ktr

గ్రేటర్ ఎన్నికలపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు మంత్రి కేటీఆర్. న‌వంబ‌ర్ 11వ తేదీ త‌ర్వాత గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌లు ఉంటాయ‌ని తాను వ్యాఖ్యానించిన‌ట్లు కొన్ని మీడియా సంస్థ‌లు రిపోర్టు చేయ‌డంలో నిజం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్… జీహెచ్ఎంసీ యాక్ట్ ప్ర‌కారం న‌వంబ‌ర్ రెండో వారం త‌ర్వాత ఎన్నిక‌లు ఎప్పుడైనా రావొచ్చ‌ని, అందుకు పార్టీ నాయ‌కులు సిద్ధంగా ఉండాల‌ని మాత్ర‌మే తాను అన్నాన‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నిక‌ల షెడ్యూల్‌, నిర్వ‌హ‌ణ పూర్తిగా ఎన్నిక‌ల క‌మిష‌న్ ప‌రిధిలోని అంశ‌మ‌ని ఆయ‌న తెలిపారు. స‌ద‌రు మీడియా సంస్థ‌లు తాను అన‌ని మాట‌ల‌ను త‌న‌కు ఆపాదించ‌డం జ‌రిగింది.. అది స‌రికాదు అని కేటీఆర్ అన్నారు.