కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌..

107
mla shankar nayak

బుధవారం గూడూరు మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 853 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా నిలుస్తుందన్నారు.అర్హులైన ప్రతి రైతు ఇంటికే పట్టాదారు పుస్తకాలు అందజేస్తామని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. కానీ కొన్నిపార్టీలు ప్రజలను, రైతులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఖాసీం, జెట్పీటీసీ సుచిత్ర, ఎంపీపీ సుజాత, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, అధికారులు పాల్గొన్నారు.