మ‌హారాష్ట్ర‌లో క‌రోనా విజృంభ‌ణ..

162
corona
- Advertisement -

దేశవ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. ప్ర‌తిరోజు భారీగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. మహారాష్ట్రాలో గురువారం రాత్రి నుంచి శుక్ర‌వారం రాత్రి వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 17,794 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13 లక్ష‌లు దాటి 13,00,757కు చేరింది. అందులో 9,92,806 మంది ఇప్ప‌టికే వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని మ‌హారాష్ట్ర ఆరోగ్య‌శాఖ ప్రకటన చేసింది.

ఈ రోజు ఒక్క‌రోజే 19,592 మంది క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి రిక‌వ‌రీ అయ్యారు. మొత్తం కేసుల‌లో రిక‌వ‌రీ అయినవారు పోగా మ‌రో 2,72,775 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా మ‌హారాష్ట్ర‌లో భారీగానే న‌మోద‌వుతున్నాయి. శుక్ర‌వారం కొత్త‌గా 416 మంది క‌రోనా బాధితులు మ‌ర‌ణించ‌డంతో ఆ రాష్ట్రంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 34,761కి చేరింది. మ‌హారాష్ట్ర ఆరోగ్య‌శాఖ అధికారులు ఈ వివ‌రాల‌ను తెలిపారు.

- Advertisement -