బిగ్ బాస్ 4..నవదీప్‌ను తలపిస్తున్న అవినాష్!

194
navdeep
- Advertisement -

బుల్లి తెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ ఫుల్‌గా మూడోవారంలోకి ఎంటరైంది. ఇప్పటివరకు 17 ఎపిసోడ్‌లు పూర్తిచేసుకోగా ఇప్పటివరకు తెలుగులో ఏ సీజన్‌కి రానంత రేటింగ్ రాగా కంటెస్టెంట్‌లకు ఇస్తున్న టాస్క్‌లు ప్రేక్షకులకు వినోదాన్ని కలిగిస్తున్నాయి.

ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వచ్చిన అవినాష్‌ అందరిని కలుపుకుపోతూ ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇక 17వ ఎపిసోడ్‌లో ముఖ్యంగా మొనాల్ అటెన్షన్‌ని కొట్టేసిన అవినాష్‌….అభిజిత్-అఖిల్‌కి పోటీగా మారాడు.

అవినాష్ వేసే జోక్స్‌కు ఇంప్రెస్ అయిన మొనాల్‌…హలో గురూ ప్రేమకోసమే పాటకు వేసిన స్టెప్పులకు ఫిదా అయిపోయింది. దీంతో అవినాష్ కూడా మొనాల్‌కి పులిహోర కలిపే పనిలో బిజీగా మారిపోయాడు.

దీంతో సీజన్ 1లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి సభ్యులను నవదీప్ ఎంటర్‌ టైన్ చేసిన విధంగానే అవినాష్ కూడా అలరిస్తున్నారని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. సీజన్ 1లో నవదీర్ థర్డ్ రన్నరప్‌గా నిలవగా అవినాష్ కూడా ఫైనల్స్‌కి చేరుతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక మూడోవారం ఎలిమినేషన్‌లో లాస్య,దేవి,కుమార్ సాయి,మొనాల్,దేత్తడి హారిక,మెహబూబ్,అరియానా ఉండగా వీరిలో ఒకరు హౌస్‌ నుండి బయటకు వెళ్లనున్నారు.

- Advertisement -