మోడీ విదేశీ పర్యటన ఖర్చులెంతో తెలుసా!

134
modi

2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు మోడీ 58 దేశాలను సందర్శించారు. ఈ నేపథ్యంలో మోడీ విదేశీ పర్యటనల ఖర్చుపై లోక్ సభలో ప్రకటన చేసింది కేంద్రం.

2015 నుండి ఇప్పటివరకు రూ.515 కోట్లు ప్రధానమంత్రి విదేశీ పర్యటనల కోసం ఖర్చు అయిందని తెలిపారు. మోడీ చివరగా గత నవంబర్‌లో బ్రెజిల్ దేశాన్ని సందర్శించారని వెల్లడించింది.

అమెరికా,రష్యా దేశాలను ఐదేసి సార్లు సందర్శించారని… మోడీ పర్యటనల వల్ల భారత్‌కు ద్వైపాక్షిక సంబంధాలు పెరిగాయని కేంద్రమంత్రి మురళీధరన్ లిఖిత పూర్వక సమాధానం లో పేర్కొన్నారు.కరోనా విజృంభన నేపథ్యంలో ఏ దేశాన్ని సందర్శించలేదని పేర్కొన్నారు.