కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా తీసుకువస్తున్న ‘ధరణి’ పోర్టల్ రూపకల్పనపై మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలోనే మొదటి సారిగా, విప్లవాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించడానికి ‘ధరణి’ పోర్టల్ రూపకల్పన జరగాలని సీఎం కెసిఆర్ ఆకాంక్షించారు.
దేశంలోనే మొట్టమొదటిసారి విప్లవాత్మక రెవెన్యూ సంస్కరణలను సీఎం కేసీఆర్ చేపట్టారు. ఇందులో భాగంగానే కోర్ బ్యాంకింగ్ తరహాలో భూమి లావాదేవీలు నిర్వహించే ప్రక్రియకు సర్కారు శ్రీకారంచుట్టింది. ఇందులో కీలకమైన ‘ధరణి’ పోర్టల్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు.
పూర్తి పారదర్శకంగా భూరికార్డుల నిర్వహణ జరిగేలా పోర్టల్ తయారీపై చర్చిస్తున్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే దిశగా తీసుకొచ్చిన కీలకమైన నూతన రెవెన్యూ బిల్లు కూడా చట్టరూపం దాల్చింది. ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపడంతో ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది.