ఐపీఎల్ 13వ సీజన్‌లో అప్పుడే సూపర్ ఓవర్‌కి తెరలేచింది.తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీతో ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 157 పరుగులు చేయగా తర్వాత ఢిల్లీ 6 వికెట్లు కొల్పోయి 157 పరుగులు చేసింది. సూపర్ ఓవర్‌లో పంజాబ్ అట్టర్ ఫ్లాప్ షోతో ఓటమిపాలైంది.
ఢిల్లీ విధించిన 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మోహిత్ శర్మ ఐదో ఓవర్లో రాహల్ (19 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) బౌల్డ్ చేయగా తర్వాత అశ్విన్ తొలిబంతికి కరుణ్ నాయర్ (1)ను, ఐదో బంతికి హిట్టర్ నికోలస్ పూరన్ (0)ను బోల్తా కొట్టించాడు. తర్వాతి ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ కూడా రబాడా బౌలింగ్‌లో వెనుదిరగడంతో పంజాబ్ 35/4తో పీకల్లోతూ కష్టాల్లో పడింది.
ఈ దశలో ఒంటరిపోరాటం చేశాడు మయాంక్ అగర్వాల్. 18 బంతుల్లో 42 పరుగులు చేయాల్సిన క్రమంలో శివమెత్తిఆడాడు మయాంక్. దీంతో 6 బంతుల్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా 6,2,4 స్కోరును సమం చేశాడు. ఇక నాలుగో బంతి డాట్, ఐదో బంతికి మయాంక్, ఆరో బంతికి జోర్డాన్ (5) ఔట్ కావడంతో మ్యాచ్ ‘టై’ అయింది.
ఇక అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ స్టొయినిస్ (21 బంతుల్లో 53; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. 17 ఓవర్లలో 100/6గా ఉన్న ఢిల్లీ స్టాయినిస్ ధాటికి 157 పరుగులు చేసింది. కింగ్స్ బౌలర్లలో షమీ 15 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడేశాడు. సూపర్ ఓవర్‌లో రబాడ సూపర్ బౌలింగ్‌తో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు.