బిగ్ బాస్ 4…సస్పెన్స్ అంటే ఇది..!

227
harika

బిగ్ బాస్ 4 తెలుగు 15 ఎపిసోడ్స్ పూర్తికాగా రెండోవారంలో అదరిపోయే సస్పెన్స్‌తో మతిపొగొట్టారు నాగార్జున. ఈ వారం ఇద్దరు హౌస్ నుండి ఎలిమినేట్ కానున్నారని ప్రకటించిన నాగ్ శనివారం ఎపిసోడ్‌లో కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. దీంతో రెండోవారం ఎవరు ఎలిమినేట్ అవుతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూడగా చివరివరకు అదిరిపోయే సస్పెన్స్‌తో చంపేశాడు నాగ్.

ఎలిమినేషన్ నుండి ఒక్కొక్కరిని తప్పించుకుంటూ వచ్చిన నాగ్‌ చివరగా దేత్తడి హారిక- మొనాల్‌లలో ఒకరు ఇంటి నుండి వెళ్లనున్నారని తెలిపారు. దీంతో అందరిలో ఒకటే ఉత్కంఠ. ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారోనని. ఈ క్రమంలో బ్లూ,గ్రీన్ కలర్‌ నీళ్లు పెట్టి వీరిలో ఒకరిని ఎలిమినేట్ చేయాలని ఏడుగురు సభ్యులు అఖిల్, మెహబూబ్, సుజాత, దేవి, లాస్య, అరియానా, దివిలకు అప్పజెప్పగా చివరగా సుజాత్ డిసైడ్ చేసే ఛాన్స్ వచ్చింది. దీంతో సుజాత….హారికను ఎలిమినేట్ చేసింది.

దేత్తడి హారిక ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించగానే అందరు షాక్‌ కాగా రాజశేఖర్ మాస్టర్ దగ్గరి నుండి అంతా ఏడ్చేశారు. హారిక లగేజ్ బ్యాగ్‌ని సర్ది ఆమెకు గ్రాండ్‌గా వీడ్కోలు పలుకుతుండగా నాగ్‌ సర్‌ప్రైజ్ ఇచ్చారు. హారిక ఎలిమినేట్ కావడం లేదని ఆమె సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని సభ్యులందరికి ఇదో హెచ్చరిక అని చెప్పారు.