వర్ధన్నపేట నియోజకవర్గ స్థాయి వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సభ అధ్యక్షతన వర్ధన్నపేట నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడే ప్రతి మాట అబద్దాల మూట అని అన్నారు సీఎం కేసిఆర్ గారు ప్రజల సమస్యల్ని దూరదృష్టితో ఆలోచించి అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు ఆ పథకాలు అన్ని కేంద్రం ఇచ్చే నిధులతో నడుస్తున్నాయనడం విడ్డూరంగా ఉందన్నారు ప్రతి నెల వృద్దులకు ఇచ్చే ఒక్క ఆసరా పెన్షన్ల కే రాష్ట్ర ప్రభుత్వం 11000కోట్లు కేటాయిస్తే కేవలం కేంద్రం ఇచ్చేది 200 కోట్లు మాత్రమేనన్నారు.
100రూపాయలలో 180 పైసలు మాత్రమే కేంద్రం ఇస్తుందన్నారు.ఇలా అబద్ధాలు చెప్పి పబ్బం గడిపే కాంగ్రెస్ బీజేపీ లకు ఈ మధ్య జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఆయా పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు ఈ ఎన్నికలను trs యూత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో కన్న అత్యధిక మెజార్టీ వర్ధన్నపేట నియోజకవర్గంలో తీసుకువచ్చి నా పేరు, ఆరూరి రమేష్ పేరును నిలబెట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు TSIIC చైర్మెన్ గ్యాదరి బాలమల్లు, మేయర్ గుండా ప్రకాష్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేష్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.