దేశంలో 54 లక్షలు దాటిన కరోనా కేసులు…

180
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 90 వేలకు పైగా కేసులు నమోదవుతుండటంతో దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 54 లక్షలు దాటాయి.

గత 24 గంట‌ల్లో కొత్త‌గా 92,605 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 1133 మంది కరోనాతో మృతిచెందారు. దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 54,00,620కు చేరాయి.

దేశంలో ప్రస్తుతం 10,10,824 యాక్టివ్‌ కేసులుండగా 43,03,044 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 86,752 మంది మృతిచెందారు. 24 గంటల్లో 12,06,806 టెస్టులు చేయగా సెప్టెంబ‌ర్ 19 వ‌ర‌కు 6,36,61,060 టెస్టులు చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.