బిగ్ బాస్ -4 లో ఎంపికైన దర్శకుడు సూర్యకిరణ్ మొదటి వారం ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆయన బిగ్ బాస్ ఇంటి నుండి బయటికి వచ్చాక పల్లు ఇంటర్వ్యూలలో అసక్తికర విషయాలు వెల్లడించారు. సూర్య కిరణ్ హీరోయిన్ కళ్యాణిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కొన్నాళ్లపాటు కలిసున్న ఈ జంట ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా సూర్యకిరణ్ క్లారిటీ ఇచ్చారు.
సూర్యకిరణ్ మాట్లాడుతూ.. అవును కళ్యాణి నన్ను వదిలివెళ్లింది నిజమే. అది నా నిర్ణయం కాదు. నాతో కలిసి జీవించాలని కళ్యాణికి ఇష్టం లేదని చెప్పాడు. నాతో సమస్యలు లేకున్నా..నాతో కలిసి జీవించకపోవడానికి ఆమెకు కారణాలున్నాయని సూర్యకిరణ్ చెప్పుకొచ్చాడు. కళ్యాణి నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయారు. ఈ జన్మకు నా భార్య కళ్యాణియేనని సూర్యకిరణ్ కన్నీరు పెట్టుకున్నారు. సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం, రాజు భాయ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సూర్యకిరణ్..ఆ తర్వాత మరే సినిమా చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ బిగ్ బాస్ ద్వారా తెరపైకి వచ్చారు.