మహేష్ కోసం మరో స్టార్‌ హీరోయిన్‌..

156
mahesh

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కనున్న మూవీ ‘సర్కారు వారి పాట’. ఇప్పటికే ఈ మూవీకి చెందిన టైటిల్ పోస్టర్ చిత్ర యూనిట్ అనౌన్స్ చేయగానే ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ చిత్రం బ్యాంకు స్కాముల నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఈ మూవీలో మహేష్ సరసన హీరోయిన్‌గా కీర్తి సురేశ్ పేరు ఇటీవల బాగా ప్రచారం అయ్యింది. ఆమెను బుక్ చేసినట్టుగా యూనిట్ వర్గాలు కూడా పేర్కొన్నాయి.

అయితే, తాజా సమాచారాన్ని బట్టి, కీర్తి ప్లేస్‌లో మరో బ్యూటీని తీసుకునే అవకాశం వుందని తెలుస్తోంది. ఈ క్రమంలో మరికొందరి పేర్లను ప్రస్తుతం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంచితే, ఈ చిత్ర కథను బట్టి అమెరికాలో కొంత షూటింగ్ చేయాల్సివుందట. అందుకోసం డెట్రాయిట్ నగరానికి వెళుతున్నట్టు సమాచారం. అక్కడ భారీ షెడ్యూలు ప్లాన్‌ చేస్తున్నారట, నవంబర్, డిసెంబర్ నెలల్లో షూటింగ్ చేయనున్నట్టు సమాచారం.