- Advertisement -
ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఛాంపియన్‌గా నిలవని జట్లలో ఒకటి ఆర్సీబీ. విరాట్ కోహ్లీ,డివిలియర్స్ లాంటి హార్డ్ హిట్టర్స్ ఉన్న ఆ జట్టుకు ఐపీఎల్ కప్ అందని ద్రాక్షలానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైన కప్ గెలిచి సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు కోహ్లీ.
ఇప్పటికే ముమ్మర ప్రాక్టీస్ మొదలుపెట్టిన విరాట్ స్వయంగా తన బ్యాట్‌లకి తానే ఫినిషింగ్ ఇచ్చాడు. ఐపీఎల్ 2020 సీజన్ కోసం ఏడు బ్యాట్‌లను కేటాయించుకున్న విరాట్ కోహ్లీ.. వాటితో ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాటింగ్ చేశాడు.
ఇందులో ఒకటి సరిగా బ్యాలెన్స్ లేకపోవడంతో హోటల్ సిబ్బంది నుంచి రంపం తెప్పించుకుని ఆ ఎక్స్‌ట్రాని కోసేశాడు. ఈ మేరకు రంపంతో బ్యాట్ హ్యాండిల్‌ని కోస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.
- Advertisement -