మొక్కలు నాటిన జబర్దస్త్ ప్రసాద్..

110
jabardasth prasad

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు జబర్దస్త్ పంచ్ ప్రసాద్.రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మూడు మొక్కలు నాటానని జబర్దస్త్ పంచ్ ప్రసాద్ అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ జబర్దస్త్ హరికృష్ణ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మోతినగర్ లోని తన నివాసంలో మొక్కలు నాటిన జబర్దస్త్ పంచ్ ప్రసాద్… అనంతరం మరో ముగ్గురు ( జబర్దస్త్ నటులు నాగిరెడ్డి , వెంకీ , బాబీ ) లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరారు.