నేచురల్ స్టార్ , సుధీర్ బాబులు హీరోలుగా నటిస్తున్న చిత్రం వి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా నాని సరసన నివదా థామస్, అదితీరావు హైదరీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 5న విడుదలైంది. నాని 25వ సినిమాగా వస్తున్న ‘V’తో అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.
కథ:
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రం V. కిరాతకంగా హత్యలు చేసే కిల్లర్(నాని)కి – ఒక ఇంటిలిజెంట్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్(సుధీర్ బాబు)కు మధ్య జరిగే కథే ఈ మూవీ. ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌ను అతని ఇంట్లోనే అత్యంత క్రూరంగా చంపేస్తాడు. ఆ తర్వాత ఆదిత్యకు ఛాలెంజ్ విసిరుతూ, క్లూస్ ఇస్తూ ఒక్కో హత్యను చేసుకుంటూ వెళ్తాడు. అసలు నాని ఎందుకు హత్యలు చేస్తున్నాడు…?కిల్లర్ నానిని సుధీర్ బాబు ఎలా పట్టుకున్నాడు అన్నదే V కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ నాని, సుధీర్ బాబు. ఇద్దరు ఒకరికి మించి మరొకరు అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. కిల్లర్‌గా నాని నటన సూపర్బ్. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్ బాబు ఇరగదీశాడు. నవలా రచయితగా, ఆదిత్యకు ప్రేయసిగా అపూర్వ పాత్రలో నివేదా థామస్ మెప్పించారు. ఇక సాహెబా పాత్ర కథకు కీలకం. ఆ పాత్రలో అదితిరావు హైదరి చక్కగా కుదిరారు. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ కథనం,స్క్రీన్ ప్లే,సెకండాఫ్. క్రైమ్ థ్రిల్లర్‌కు స్క్రీన్ ప్లే ప్రధాన బలం కాగా స్క్రీన్ ప్లే ఫ్లాట్‌గా వెళ్లిపోయింది. సెకండాఫ్‌పై మరింత దృష్టిసారించి ఉంటే బాగుండేది. మాక్స్‌లో ట్విస్ట్ ఉన్నా అది పెద్దగా కిక్ ఇవ్వదు.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా సూపర్బ్. తమన్ నేపథ్య సంగీతం….అమిత్ త్రివేది సంగీతం పర్వాలేదనిపిస్తుంది. పి.జి.విందా సినిమాటోగ్రఫీ ,ఎడిటింగ్ బాగుంది. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు.
తీర్పు:
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన చిత్రం V.నాని, సుధీర్ బాబు నటన సినిమాకు ప్లస్ పాయింట్ కాగా సెకండాఫ్,క్లైమాక్స్ మైనస్ పాయింట్స్. మొత్తంగా పెద్దగా థ్రిల్ ఇవ్వని సస్పెన్స్, రివేంజ్ డ్రామాతో పర్వాలేదనిపించిన మూవీ V.
విడుదల తేదీ:05/09/2020
రేటింగ్: 2.75/5
నటీనటులు: నాని,సుధీర్ బాబు,నివేదా,అదితిరావు
సంగీతం: అమిత్ త్రివేది
నిర్మాత:దిల్ రాజు
దర్శకుడు: మోహనకృష్ణ ఇంద్రగంటి