రాష్ట్రంలో 24 గంటల్లో 2511 కరోనా కేసులు…

134
coronavirus

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,511 పాజిటివ్ కేసులు నమోదుకాగా 11 మంది మృతిచెందారు.

దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,38,395కి చేరగా లక్షా 5 వేల మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 32,915 యాక్టివ్ కేసులుండగా 877 మంది కరోనాతో మృతిచెందారు.

తెలంగాణలో మరణాల రేటు 0.63 శాతంగా ఉండగా దేశంలో 1.73 శాతంగా ఉంది. కరోనా నుండి కోలుకున్నవారి సంఖ్య 75.5 శాతానికి పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.