నాని ‘వి’ సినిమా విడుదల వాయిదా

420
v movie
- Advertisement -

నేచురల్ స్టార్ , సుధీర్ బాబులు హీరోలుగా నటిస్తున్న చిత్రం వి. ఇంద్రగంటి మోహనకృష్ణ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈసినిమాలో నివేధా ధామస్, అదితీరావు హైదరీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటివలే ఈమూవీ షూటింగ్ పూర్తైంది. మార్చ్ చివరి వారంలో ఈమూవీని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

కరోనా వైరస్ కారణంగా ఈమూవీ విడుదలను వాయిదా వేశారు చిత్రయూనిట్. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రేక్షకుల ఆరోగ్యం, క్షేమం తమకు ముఖ్యమని… అది తమ బాధ్యత అని చెప్పింది. సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామని… వచ్చే నెలలో విడుదల చేస్తామని తెలిపింది. కాగా కరోనా వైరస్ విభృంబిస్తుండంటతో దేశ వ్యాప్తంగా పలు స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు.

- Advertisement -