దేశంలో కరోనాతో 67,376 మంది మృతి…

203
corona
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. రోజుకు 70 వేలకు చేరువలో కేసులు నమోదవుతుండగా గత 24 గంటల్లో 84 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

గ‌త 24 గంట‌ల్లో 83,883 క‌రోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 1043 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో 67,376 మంది మృతిచెందారు. దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 38,53,407కు చేరగా 29,70,493 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు.ప్రస్తుతం దేశంలో 8,15,538 యాక్టివ్ కేసులున్నాయి.

గత 24 గంటల్లో 11,72,179 కరోనా టెస్టులు చేయగా సెప్టెంబ‌ర్ 2 వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 4,55,09,380 టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.

- Advertisement -