- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు 80 వేలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతుండటంతో 38 లక్షలకు కేసులు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 78357 కేసులు నమోదు కాగా 1045 మంది మృతిచెందారు.
ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 37,69,523కి చేరగా ప్రస్తుతం 8,01,282 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. 29,01,908 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇప్పటివరకు 66,333 మంది మృతిచెందారు.
దేశంలో రోజుకు 10 లక్షలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతుండగా మొత్తం టెస్టుల సంఖ్య 5 కోట్లకు చేరువయ్యాయి.
- Advertisement -