రానున్న రెండేళ్ల లో టీఎస్ ఐఐసీ ద్వారా ఫార్మా సిటీ, నీమ్జ్, కాకతీయ టెక్స్ టైల్స్ వంటి పారిశ్రామిక మెగా ప్రాజెక్టులు వేల కోట్ల పెట్టుబడులతో కార్యరూపంలోకి రానున్నాయని టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. ఈ భారీ ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు టీఎస్ ఐఐసీలో సమర్థవంతంగా పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారుల సేవలను తప్పనిసరిగా వినియోగించుకుంటామని చెప్పారు.
సోమవారం టీఎస్ ఐఐసీలో ఫైనాన్స్ జీఎం బిక్షా పదవీ విరమణ కార్యక్రమంలో టీఎస్ ఐఐసీ చైర్మన్ బాలమల్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండీ వెంకట్ నర్సింహారెడ్డి, సీఈవో మధుసూదన్ తో కలిసి భిక్షా ను సన్మానించారు. అనంతరం బాలమల్లు మాట్లాడుతూ.. అకౌంట్స్ అసిస్టెంట్ నుండి కష్టపడి పనిచేసి టీఎస్ ఐఐసీలో ఉన్నత పోస్టు జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగడం బిక్షా కృషికి నిదర్శనమన్నారు.
29 సంవత్సరాలు టీఎస్ ఐఐసీలో వివిధ హోదాలలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించి రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి తనవంతు కృషి చేశారని అభినందించారు. టీఎస్ ఐఐసీ కార్యాచరణపై బిక్షాకు ఉన్న అనుభవం, అంకితభావాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు లో ఆయన సేవలను వినియోగించుకుంటామని బాలమల్లు పేర్కొన్నారు. టీఎస్ ఐఐసీ ఎండీ వెంకట్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. టీఎస్ ఐఐసీ ద్వారా వచ్చే రెండేళ్ల లో రూ.15 వేల నుండి రూ.20 వేల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో ఫార్మాసిటీ,నీమ్జ్ లాంటి మెగా పారిశ్రామిక ప్రాజెక్టులను పూర్తి చేయడం జరుగుతుందన్నారు.
ఈ ప్రాజెక్టులను కార్యరూపం లోకి తీసుకురావడానికి టీఎస్ ఐఐసీలో పదవీ విరమణ పొందిన అనుభవం, సమర్థత ఉన్న అధికారుల సేవలను వినియోగించుకోవడానికి ఆస్కారం ఉందన్నారు. కార్యక్రమంలో టీఎస్ ఐఐసీ ప్రాజెక్టుల సీఈవో మధుసూదన్, చీఫ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, జీఎం ఫైనాన్స్ నరసింహన్, డీజీఎంలు విఠల్, కవిత, ఉమా మహేశ్వర్, అనురాధ, జోనల్ మేనేజర్లు రవి, వినోద్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీఎస్ ఐఐసి కి బిక్షా చేసిన సేవలను మెగా పారిశ్రామిక ప్రాజెక్టుల లక్ష్య సాధనకు వేల కోట్ల పదవీ విరమణ పొందిన సోమవారం పదవీ విరమణ పొందిన టీఎస్ ఐఐసీ ఫైనాన్స్ జీఎం భిక్షా గారిని టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు గారు సన్మానించారు. కార్యక్రమంలో టీఎస్ ఐఐసీ ఎండీ వెంకట్ నర్సింహారెడ్డి, సీఈవో మధుసూదన్ గార్లు. ఇతర అధికారులు బిక్షా గారికి ఘనంగా సన్మానంతో వీడ్కోలు పలికారు.