తెలంగాణలో కులవృత్తులకు న్యాయం: శ్రీనివాస్ గౌడ్

298
srinivas
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కులవృత్తులకు న్యాయం జరుగుతుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌. జనగామ జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన చేప పిల్లల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై మూడు జిల్లాలకు రెండు కోట్ల రూపాయల నిధులను కేటాయించేదన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఉచిత చేప పిల్లలు అందించి ముదిరాజ్, బెస్త కులస్తులకు అండగా నిలుస్తుంది. …కేసిఆర్ పాలనలో ప్రతి పల్లెలో చెరువులు కుంటలు నిండుకుండలా అలుగులు పోస్తున్నాయని తెలిపారు. కుల వృత్తులకు రైతు సోదరులకు కేసిఆర్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది….దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానానికి ఎదగడానికి ప్రజాప్రతినిధులం నిరంతరం కృషి చేస్తాం అన్నారు.

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండల గూడెం లో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ….. సర్దార్ సర్వాయి పాపన్న ఒక కులానికి ఒక వర్గానికో నాయకుడు కాదు ఆయన బహుజన వర్గాలకు నాయకుడు అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను రూపుమాపాలని ప్రయత్నం చేశారు… తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు కులాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమ న్యాయం చేస్తున్నారని తెలిపారు. గౌడ కులస్తులకు తాటి చెట్ల పన్నును రద్దు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్…… జనగామ జిల్లాలో ఉన్న చారిత్రక ప్రదేశాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేస్తున్నాం అన్నారు.

- Advertisement -