తెలంగాణ వెదర్ అప్‌డేట్….

167
rains

పశ్చిమ మధ్యప్రదేశ్ మరియు దానిని ఆనుకుని ఉన్న తూర్పు రాజస్థాన్ ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా 7.6 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది.

ఉత్తర-దక్షిణ ద్రోణి రాయలసీమ నుండి దక్షిణ తమిళనాడు వరకు 1.5 km ఎత్తు వరకు కొనసాగుతోంది.అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు కొన్ని చోట్ల మరియు ఎల్లుండి చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.