భారత్ బయోటిక్ రెండో విడత క్లినికల్ ట్రయల్స్‌కు రంగం సిద్ధమైంది. స్వదేశీ కొవిడ్-19 వ్యాక్సిన్ కోవాగ్జిన్ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ మొదటి విడతలో సక్సెస్ కావడంతో రెండో విడత మానవ క్లినికల్ ట్రయల్స్ కోసం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 12 సైట్లలో ఒడిశాలోని ఎస్‌యూఎం ఆస్పత్రిని సిద్ధం చేశారు.
రెండో దశ క్లినికల్ ట్రయల్ కోసం స్వచ్ఛందంగా పలువురు ముందుకు వచ్చిన దవాఖాన అధికారులను ఆశ్రయించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. వ్యాక్సిన్ అందుకున్న తరువాత మేం ఎదుర్కొనే ఆరోగ్య సంక్లిష్టతలను జాబితా చేయడం కోసం డైరీని మెయింటైన్ చేయాలని వైద్యులు కోరారని, తలనొప్పి, జ్వరం, బాడీ పెయిన్, డయేరియా వంటి సమస్యలు ఎదురకాలేదని పేర్కొన్నారు.
రెండో దశ ట్రయల్స్ అనంతరం మూడో దశ ట్రయల్స్ విజయవంతమైతే ఈ ఏడాది చివరి నాటికి, లేదంటే వచ్చే ఏడాది ప్రారంభానికి కొవాగ్జిన్ టీకా సిద్ధం అవుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.