సీఎస్‌కేకు షాక్‌…ఐపీఎల్‌ నుండి రైనా ఔట్!

182
raina

ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే చెన్నై జట్టులో 10 మంది సభ్యులకు కరోనా వైరస్‌ సోకగా టోర్నీ ప్రారంభానికి ముందే ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా టోర్నీకి దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో జట్టునుండి తప్పుకుంటున్నట్లు రైనా తెలపగా ఈ విషయాన్ని ధృవీకరించింది సీఎస్‌కే యాజమాన్యం.

రాబోయే సీజన్‌కు రైనా అందుబాటులో ఉండడని టీమ్‌ సీఈవో కేఎస్‌ విశ్వనాథన్‌ తెలిపారు. సురేశ్‌ రైనా వ్యక్తిగత కారణాల వల్ల భారత్‌కు తిరిగొచ్చేశాడు. ఈ సీజన్‌ మొత్తానికి అతడు అందుబాటులో ఉండడు. రైనాతో పాటు అతని కుటుంబానికి పూర్తి మద్దతుగా ఉంటుందని చెన్నై ఫ్రాంఛైజీ పేర్కొంది.