మారిన గ్రామాల రూపురేఖలు:మంత్రి ఎర్రబెల్లి

241
errabelli
- Advertisement -

పల్లె ప్రకృతి వనాల పై ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సీఎం కేసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ రాజ్ చట్టం తెచ్చిన మార్పులతో ఆకు పచ్చ తెలంగాణ ఆవిష్కృతం అవుతుందన్నారు.

కేసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ఆయా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఎకరం స్థలంలో ఏర్పాటు చేసే పల్లె ప్రకృతి వనాలతో పల్లెల్లో ఆహ్లాద వాతావరణం ఏర్పడుతున్నది. ప్రజలు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ సేద తీరడానికి వీలు కలుగుతుందన్నారు.

వాతావరణ సమతౌల్యానికి పల్లె ప్రకృతి వనాలు దోహదం చేస్తున్నాయని…సమయానుకూలంగా మంచి వర్షాలు పడి, రైతాంగానికి, ప్రజలకు మేలు చేస్తాయన్నారు. ప్రకృతి వనాల్లో పండ్లనిచ్చే, ఔషధ మొక్కలు నాటుతున్నామని….స్వచ్చమైన గాలి, మంచి ఆక్సీజన్ అంది ఆరోగ్య తెలంగాణ సాధ్యం అవుతుందన్నారు.

- Advertisement -