మొక్కలు నాటే మహా యజ్ఞం…ఊరంతా సంబురం

281
green
- Advertisement -

ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలి-నాటిన ప్రతీ మొక్కని కన్న బిడ్డలాగా కాపాడుకోవాలి.ఇదే నినాదంతో ముందుకు సాగుతున్న ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం గోదావరి ప్రవాహంలా ఉరకలేస్తుంది.

చిన్న-పెద్ద,ఊరు-వాడ అంత కలిసి మొక్కలు నాటే యజ్ఞంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.2 కిలోమీటర్ల మేరా రోడ్డుకు ఇరువైపులా 200 మంది ఒకే చోట చేరి 800 మొక్కలు కలిసికట్టుగా నాటి నారాయణ్ ఖేడ్ మండలంలోని జంలానాయక్ తాండ వాసులు మరెంతో మందికి స్ఫూర్తిని నిలిచారు.సంగారెడ్డి జిల్లా కలెక్టరు హన్మంతరావు గారి ఆధ్వర్యంలో జరిగిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఒకే చోట 800మొక్కలు నాటి హరిత తెలంగాణ దిశగా సాగాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా కలెక్టర్…గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహిస్తున్న ఎంపీ సంతోష్ గారికి ధన్యవాదాలు తెలిపారు.ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆయన కృషిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డీఆర్డీఓ శ్రీనివాసరావు, జంలానాయక్ తాండ సర్పంచ్ చరణ్, గ్రామస్తులు మరియు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి పూర్ణచందర్ పాల్గొన్నారు.

- Advertisement -