శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదంలో మరణించిన ఉద్యోగుల ప్రాణ త్యాగం వెలకట్టలేనిదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. జరిగిన ఘటనను దురదృష్ట కర ఘటన గా మంత్రి పేర్కొన్నారు.
ప్రమాదం లో మృతి చెందిన మంత్రి సొంత నియోజకవర్గం అయిన చివ్వేంల మండలం జగన్ నాయక్ తండా కు చెందిన ఏ.ఈ సుందర్ నాయక్ కుటుంభ సభ్యులను మంత్రి పరామర్శించారు. సుందర్ నాయక్ భార్యా పిల్లలు ,తల్లిదండ్రులతో మాట్లాడిన మంత్రి వారికి దైర్యం చెప్పి ప్రగాఢ సంతాపం తెలిపారు.
అన్ని విధాలా అండగా ఉంటామని తెలపడం తో పాటు ఇదే శాఖ లో సుందర్ నాయక్ భార్య కోరుకున్న చోట ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.. అయితే సుందర్ నాయక్ భార్య పిల్లల చదువుల దృష్ట్యా తనకు హైదరాబాద్ లో ఉద్యోగం కావాలని మంత్రి ని కోరగా అందుకు మంత్రి గారు వెంటనే సరే అని హామీ ఇచ్చారు.వార్త తెలిసిన వెంటనే ఆగమేఘాల మీద ప్రమాదస్థలికి చేరుకొని పోలీసులు ఇతర అధికారులు వద్దని వారించినా వినకుండా ఉద్యోగుల ప్రాణాలు కాపాడటానికి మంత్రి ప్రదర్శించిన ధైర్య సాహసాలను ఈ సందర్భంగా సుందర్ నాయక్ కుటుంభ సభ్యులు కొనియాడారు..