- Advertisement -
త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ షోలో పాల్గొనే వారి పేర్లు ఇవేనంటూ రకరకలా పుకార్లు షికార్ చేస్తున్నాయి. తాజాగా హీరో నందు బిగ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.
ఈ వార్తలపై స్పందించారు హీరో నందు. డార్లింగ్స్ నేను బిబి లో వస్తున్నా బిబి లో మన రచ్చ మామూలుగా వుండదు. మీకు మరింత వినోదాన్ని పంచుతాను. మీ మద్దతు నాకు కావాలి అంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు.
ప్రేక్షకులను ఆకర్షించడం కోసం మరికొన్నిఆసక్తికర విషయాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు..వాటిని రేపు సాయంత్రం ప్రకటిస్తానని తెలిపారు నందు. దీంతో నందు చెప్పే ఆ ఆసక్తికర విషయాలు ఏంటనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
- Advertisement -